Mana Ghantasala Song Lyrics

bhUmikOsaM bhuktikOsam

Movie:bhoomikOsam (1974)Lyrics:SriiSrii
Music:penDyAlaSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
భూమికోసం భుక్తికోసం
సాగే రైతుల పోరాటం
అనంత జీవిత సంగ్రామం

రాజులు మారి, రోజులుమారి
పాలన చేసే పధ్ధతి మారి
మారని దొకటేరా - అది
దున్నే రైతుల బ్రతుకేరా

సంపద పెంచే తీరులు మారి
పంపకాలలో రీతులు మారి
మారని దొకటేరా - అది
పేదల ఆకలి మంటేరా
భూమికోసం భుక్తికోసం

తూరుపు దిక్కున వీచే గాలి
పడమటి కడలిని పిలిచే గాలి
తూరుపు పడమర లేకంచేసే
తుఫానులా చెలరేగేదాకా

భూమికోసం భుక్తికోసం
సాగే రైతుల పోరాటం
అంతంకాదిది ఆరంభం
భూమికోసం భుక్తికోసం

bhUmikOsaM bhuktikOsaM
sAgE raitula pOrATaM
anaMta jiivita saMgrAmaM

rAjulu mAri, rOjulumAri
pAlana cEsE padhdhati mAri
mArani dokaTErA - adi
dunnE raitula bratukErA

saMpada peMcE tiirulu mAri
paMpakAlalO riitulu mAri
mArani dokaTErA - adi
pEdala aakali maMTErA
bhUmikOsaM bhuktikOsaM

tUrupu dikkuna viicE gAli
paDamaTi kaDalini pilicE gAli
tUrupu paDamara lEkaMcEsE
tufAnulA celarEgEdAkA

bhUmikOsaM bhuktikOsaM
sAgE raitula pOrATaM
aMtaMkAdidi aaraMbhaM
bhUmikOsaM bhuktikOsaM