|
Mana Ghantasala Song LyricshalO sArU bhale vAru cheli valapu telusukOru |
| Movie:amAyakurAlu (1971) | Lyrics:aarudra |
| Music:s. rajeshwara rao | Singers:ghaMTasaala, suSeela |
| Submitted by: Krishna Kondaka | |
|
హలో సారూ భలె వారు చెలి వలపు తెలుసుకోరు పైకెంతో చల్లని వారు తమరెంతో అల్లరివారు నా మనసు దోచినారు చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు లల ఒహో ఒహో లలల్లల రానింము రానింము ఏమైనకానీ నా ఇంపు నా సొంపు నీ సొంము కాదా (2) నా తోడు నీవై నీ నీడ నేనై కలవాలి కరగాలి కావాలి ఒకటిగా ఆ.. చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు హలో సారూ భలె వారు చెలి వలపు తెలుసుకోరు రావాలి రావాలి సరియైన అదను ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు (2) ఆలోగ నీవు ఆవేశ పడకు ఆకాశ సౌధాలు నిర్మించ రాదులే హలో సారూ భలె వారు చెలి వలపు తెలుసుకోరు చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు అనురాగ బంధాలు సడలించవద్దు పెనవేయు హృదయాలు విడదీయవద్దు (2) నీ లేత వలపు ఆమోదమైన బంగారు స్వప్నాలు పండేది ముందెపుడో హలో సారూ భలె వారు చెలి వలపు తెలుసుకోరు చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు | |
halO sArU bhale vAru cheli valapu telusukOru paikeMtO challani vAru tamareMtO allarivAru nA manasu dOchinAru chAlu chAlu sarasAlu ika dUraMgA uMTEnE mElu lala ohO ohO lalallala rAniMmu rAniMmu EmainakAnI nA iMpu nA soMpu nI soMmu kAdA (2) nA tODu nIvai nI nIDa nEnai kalavAli karagAli kAvAli okaTigA aa.. chAlu chAlu sarasAlu ika dUraMgA uMTEnE mElu halO sArU bhale vAru cheli valapu telusukOru rAvAli rAvAli sariyaina adanu aanADu ivvAli nI niMDu manasu (2) aalOga nIvu aavESa paDaku aakASa soudhAlu nirmiMcha rAdulE halO sArU bhale vAru cheli valapu telusukOru chAlu chAlu sarasAlu ika dUraMgA uMTEnE mElu anurAga baMdhAlu saDaliMchavaddu penavEyu hRdayAlu viDadIyavaddu (2) nI lEta valapu aamOdamaina baMgAru swapnAlu paMDEdi muMdepuDO halO sArU bhale vAru cheli valapu telusukOru chAlu chAlu sarasAlu ika dUraMgA uMTEnE mElu | |