Mana Ghantasala Song Lyrics

rAju veDalenidigO

Movie:abhimAnam (1959)Lyrics:samudraala #Jr.#
Music:ghaMTasaalaSingers:ghaMTasaala, nalla raamamUrti,pithapuram, bRndam
Submitted by: Sreenivas Paruchuri
ఘం: రాజు వెడలెనిదిగో
రాజు వెడలె రవి తేజములలరగ రాజ సభకు నేడు
రయమునను రాజు వెడలె రవి తేజములలరగ రాజ సభకు నేడు
రాజు వెడలె రవి తేజములలరగ రాజ సభకు నేడు
ఘోరకలికి జోహారని జగములు హారతియ్యగానోయ్‌
కాలమందు కలికాలము పేరు నిలచి వెనుకగానోయ్‌
క్రూరులెందరి జోరణగించిన వీరకలి, శూరకలి, ఘోరకలి
రాజు వెడలె రవి తేజములలరగ రాజ సభకు నేడు

ఓహో మంత్రి సత్తముండా!

నల్ల: ఇదే వచ్చుచున్నాను రాజోత్తముండ!
ఘం: నెలకు మూడు వర్షంములు అదునుగ నిండుగ కురియుచున్నవా! (2)
నల్ల: ప్రభు! నెలకు మూడు వర్షంములు పదునుగ నిలవక కురియుచున్నవి
ఘం: మేలు చేసి మనమేలేవారికి కష్టాలేమి లేవుగా!
నల్ల: కష్టాలన్ని సుఖముగ నెంచి సంతోషంబుగ నుండిరిగా
ఘం: శభాష్‌, శభాష్‌

బృందం: ఆ ......

ఆశ్చర్యము, ఆశ్చర్యము! ప్రభో చిత్ర విచిత్రము

ఘం: ఒరేయ్‌ శని మహామంత్రి!
నల్ల: ప్రభూ!
ఘం: రామరాజ్యము వంటి మా రాజ్యమందు (2)
ఏమిటీ ఆర్తి? మా కీర్తి కెంత లోటు!
వెంటనే వాళ్ళ ఏడుపు వివరమెరిగి మనవి చేయుము శని మహామంత్రివర్యా!

బృందం: కరువు తీరబోదా! మా కొరత మాసిపోదా!
రైతు జనులకు కష్టము తొలిగే రోజులు రానేరాబోవా!
కరువు తీరబోదా! మా కొరత మాసిపోదా!

??????? పొలాన జారెడు నీరు లేదండి! ???? పైరు కాదండి
ఆనకట్టలు వేదామంటే కానీయైనా లేదండి
కరువు తీరబోదా! మా కొరత మాసిపోదా!

కార్మికులం కార్మికులం కష్టజీవులం
పనేలేక మాడే కూలీలము
కార్మికులం కార్మికులం కష్టజీవులం
గనులలో, ?అనులలో ఖనిజ ముంది దండిగా
పనిచేసే జనముంది ????? మెండుగా
పరిశ్రమేది భారీగా పైకిరాదుగా
పెట్టుబడికి కాసైనా ధనము లేదుగా! ధనము లేదుగా!
కార్మికులం కార్మికులం కష్టజీవులం
పనేలేక మాడే కూలీలము
కార్మికులం కార్మికులం కష్టజీవులం

ఘం: ఒరేయ్‌ శని మహామంత్రి!
నల్ల: ప్రభూ!
ఘం: మన దేశములోగల డబ్బంతా ఏమై ఉండును?
నల్ల: ఎంత తిరిగి తిరిగి తిరిగి వేటాడినను దాని అడ్రసే దొరకలేదు ప్రభూ!
ఘం: అహా! అయితే సినిమాలో విలానీగా ఉండిపోయి ఉండునా!
నల్ల: అది మీరడగను కూడదు, నేను చెప్పనూ గూడదు
ఘం: అయితే చీమలు యెత్తుకుని పోయి ఉండునా!
నల్ల: చీమలు ఎంత అని యెత్తుకుని పోగలవు ప్రభూ!
ఘం: ఛీ ఛీ! అయిన చనిపోయేటప్పుడు వెంట తీసుకుని పోయి ఉందురా!
నల్ల: ఎలాగా వచ్చారో అలాగే పోతున్నారు ప్రభూ...!
ఘం: అయితే ఈ డబ్బంతా ఏమై ఉండును?
నల్ల: మీరేమి అనుకోకుండా ఉంటానంటే ఒక్కమాట చిత్తగిస్తాను
ఘం: చిత్తగించుము!
నల్ల: మరంటేనండి ఉన్నవారు ఇనప్పెట్టెల్లోను
ఇనప్పెట్టెల్లేనివాళ్ళు కావిడి పెట్టెల్లోను
కావిడి పెట్టెల్లెని వాళ్ళు పిడతల్లోను
పిడతల్లేనివాళ్ళు గడపెట్టెని (?)
కలకాలంనుంచి ఈ సొంమంతా దాచి పెట్టేశారు బాబూ!
ఘం: ఏ బాబు?
నల్ల: మీ బాబే బాబూ!
ఘం: అయ్య బాబోయ్‌!
నిజం తెలిసెరా ఇవాళనైనా బజాయించరా ఘంటా!
బృందం: బజాయించరా ఘంటా!
ఘం: సజావైన మన ప్రజా ధనాన్ని ఖజానాలలో దాచారా!
బృందం: ఖజానాలలో దాచారా!
ఘం: ఇది సహించము, ఇక క్షమించము, ఇది గ్రహింతుము
ఇంప్పెట్టి పగలగొట్టి ధనం తెచ్చి పంచిపెట్టు
నల్ల: ధనాధం ఫటాఫట్‌
బృందం: పదండి పదండి పదండిహో (2)
పదండిహో (2)


ghaM:	rAju veDalenidigO
rAju veDale ravi tEjamulalaraga rAja sabhaku nEDu
rayamunanu rAju veDale ravi tEjamulalaraga rAja sabhaku nEDu
rAju veDale ravi tEjamulalaraga rAja sabhaku nEDu
ghOrakaliki jOhArani jagamulu hAratiyyagAnOy^
kAlamaMdu kalikAlamu pEru nilaci venukagAnOy^
krUruleMdari jOraNagiMcina veerakali, SUrakali, ghOrakali
rAju veDale ravi tEjamulalaraga rAja sabhaku nEDu

OhO maMtri sattamuMDA!

nalla:	idE vaccucunnAnu rAjOttamuMDa!
ghaM:	nelaku mUDu varshaMmulu adunuga niMDuga kuriyucunnavA! (2)
nalla:	prabhu! nelaku mUDu varshaMmulu padunuga nilavaka kuriyucunnavi
ghaM:	mElu cEsi manamElEvAriki kashTAlEmi lEvugA!
nalla:	kashTAlanni sukhamuga neMci saMtOshaMbuga nuMDirigA
ghaM:	SabhAsh^, SabhAsh^

bRndaM:	aa ......

aaScaryamu, aaScaryamu! prabhO citra vicitramu

ghaM:	orEy^ Sani mahAmaMtri!
nalla:	prabhU!
ghaM:	rAmarAjyamu vaMTi mA rAjyamaMdu (2)
EmiTii aarti? mA kiirti keMta lOTu!
veMTanE vALLa EDupu vivaramerigi manavi cEyumu Sani mahAmaMtrivaryA!

bRndaM:	karuvu tiirabOdA! mA korata mAsipOdA!
raitu janulaku kashTamu toligE rOjulu rAnErAbOvA!
karuvu tiirabOdA! mA korata mAsipOdA!

??????? polAna jAreDu niiru lEdaMDi! ???? pairu kAdaMDi
aanakaTTalu vEdAmaMTE kaaniiyainaa lEdaMDi
karuvu tiirabOdA! mA korata mAsipOdA!

kArmikulaM kArmikulaM kashTajeevulaM
panElEka mADE kUliilamu
kArmikulaM kArmikulaM kashTajeevulaM
ganulalO, ?anulalO khanija muMdi daMDigA
panicEsE janamuMdi ????? meMDugA
pariSramEdi bhAriigA paikirAdugA
peTTubaDiki kaasainA dhanamu lEdugA! dhanamu lEdugA!
kArmikulaM kArmikulaM kashTajeevulaM
panElEka mADE kUliilamu
kArmikulaM kArmikulaM kashTajeevulaM

ghaM:	orEy^ Sani mahAmaMtri!
nalla:	prabhU!
ghaM:	mana dESamulOgala DabbaMtA Emai uMDunu?
nalla:	eMta tirigi tirigi tirigi vETADinanu dAni aDrasE dorakalEdu prabhU!
ghaM:	ahA! ayitE sinimAlO vilAniigA uMDipOyi uMDunA!
nalla:	adi miiraDaganu kUDadu, nEnu ceppanU gUDadu
ghaM:	ayitE ciimalu yettukuni pOyi uMDunA!
nalla:	ciimalu eMta ani yettukuni pOgalavu prabhU!
ghaM:	Chii Chii! ayina canipOyETappuDu veMTa tiisukuni pOyi uMdurA!
nalla:	elAgA vaccArO alAgE pOtunnAru prabhU...!
ghaM:	ayitE ii DabbaMtA Emai uMDunu?
nalla:	miirEmi anukOkuMDaa uMTAnaMTE okkamATa cittagistAnu
ghaM:	cittagiMcumu!
nalla:	maraMTEnaMDi unnavAru inappeTTellOnu
inappeTTellEnivALLu kAviDi peTTellOnu
kAviDi peTTelleni vALLu piDatallOnu
piDatallEnivALLu gaDapeTTeni (?)
kalakAlaMnuMci ii soMmaMtA dAci peTTESAru bAbU!
ghaM:	E bAbu?
nalla:	mii bAbE bAbU!
ghaM:	ayya bAbOy^!
nijaM teliserA ivALanainA bajAyiMcarA ghaMTA!
bRndaM:	bajAyiMcarA ghaMTA!
ghaM:	sajAvaina mana prajA dhanAnni khajAnAlalO dAcArA!
bRndaM:	khajAnAlalO dAcArA!
ghaM:	idi sahiMcamu, ika xamiMcamu, idi grahiMtumu
iMppeTTi pagalagoTTi dhanaM tecci paMcipeTTu
nalla:	dhanAdhaM phaTAphaT^
bRndaM:	padaMDi padaMDi padaMDihO (2)
padaMDihO (2)