|
Mana Ghantasala Song Lyricsevariki varou swArthaMlO hRdayAlarudavu lOkaMlO |
| Movie:guDiganTalu (1964) | Lyrics:aniseTTi #or# aatrEya (?) |
| Music:ghaMTasaala | Singers:ghaMTasaala |
| Submitted by: Panini | |
|
నరుల జీవిత పథమున నడుపువాడు కాళ్ళు లేని అభాగ్యుడై కనలె నేడు స్నేహితుని గుండె శోకపు చితిగ మారె ప్రణయమూర్తికి బ్రతుకొక ప్రళయమాయె శాంతి సుఖముల తేలెడు జీవితముల చిచ్చు పెట్టుటే దైవ విలాసమేమో, దైవ విలాసమేమో ఎవరికి వారౌ స్వార్థంలో, హృదయాలరుదవు లోకంలో (2) నాకై వచ్చిన నెచ్చెలివే అంమృతం తెచ్చిన జాబిలివే, నాకంమృతం తెచ్చిన జాబిలివే ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చావే నా అనువారే లేరని నేను కన్నీరొలికే కాలంలో ఉన్నానని నా కన్నతల్లి వలె ఒడిని జేర్చి నన్నోదార్చేవే నాకై వచ్చిన నెచ్చెలివే అంమృతం తెచ్చిన జాబిలివే, నాకంమృతం తెచ్చిన జాబిలివే ప్రేమ కొరకు ప్రేమించేవారే కానరాక గాలించాను గుండెలు తెరచి ఉంచాను గుడిలో దేవుని అడిగాను గంటలు గణగణ మ్రోగాయి, నా కంటిపాపను అన్నాయి నాకై వచ్చిన నెచ్చెలివే అంమృతం తెచ్చిన జాబిలివే, నాకంమృతం తెచ్చిన జాబిలివే ఈ అనురాగం ఈ ఆనందం, ఎవ్వరెరుగని ఈ అనుబంధం (2) ఊడలు పాతీ, నీడలు పరచీ ఉండాలీ వెయ్యేళ్ళు, చల్లగ ఉండాలీ వెయ్యేళ్ళు తీయగ పండాలి మన కలలు ఎవరికి వారౌ స్వార్థంలో, హృదయాలరుగవు లోకంలో నాకై వచ్చిన నెచ్చెలివే అంమృతం తెచ్చిన జాబిలివే, నాకంమృతం తెచ్చిన జాబిలివే | |
narula jiivita pathamuna naDupuvADu kALLu lEni abhAgyuDai kanale nEDu snEhituni guMDe SOkapu citiga mAre praNayamUrtiki bratukoka praLayamAye SAMti sukhamula tEleDu jiivitamula ciccu peTTuTE daiva vilAsamEmO, daiva vilAsamEmO evariki vArou swArthaMlO, hRdayAlarudavu lOkaMlO (2) nAkai vaccina neccelivE aMmRtaM teccina jAbilivE, nAkaMmRtaM teccina jAbilivE dhanamu kOri manasiccE dharaNi manishini kOri vaccAvE nA anuvArE lErani nEnu kanniirolikE kAlaMlO unnAnani nA kannatalli vale oDini jErci nannOdArcEvE nAkai vaccina neccelivE aMmRtaM teccina jAbilivE, nAkaMmRtaM teccina jAbilivE prEma koraku prEmiMcEvArE kAnarAka gAliMcAnu guMDelu teraci uMcAnu guDilO dEvuni aDigAnu gaMTalu gaNagaNa mrOgAyi, nA kaMTipApanu annAyi nAkai vaccina neccelivE aMmRtaM teccina jAbilivE, nAkaMmRtaM teccina jAbilivE ii anurAgaM ii aanaMdaM, evvarerugani ii anubaMdhaM (2) UDalu pAtii, niiDalu paracii uMDAlii veyyELLu, callaga uMDAlii veyyELLu tiiyaga paMDAli mana kalalu evariki vArou swArthaMlO, hRdayAlarugavu lOkaMlO nAkai vaccina neccelivE aMmRtaM teccina jAbilivE, nAkaMmRtaM teccina jAbilivE | |