|
Mana Ghantasala Song Lyricsraktasambandham, idE raktasambandham |
| Movie:raktasaMbandham | Lyrics:aniseTTi |
| Music:ghaMTasaala | Singers:ghaMTasaala |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
నా హృదయంలో నిదురించే చెలీ! కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే! నా హృదయంలో నిదురించే చెలీ! నీ కన్నులలోన - దాగెనులే వెన్నెలసోన చకోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలీ! నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే (2) పల్లవిగా పలుకరించరావే (2) నీ వెచ్చని నీడ - వెలసెను నా వలపుల మేడ వెచ్చని నీడ - వెలసెను నా వలపుల మేడ నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే చెలీ! | |
naa hRdayaMlO niduriMcE celii! kalalalOnE kavviMcE sakhii mayoorivai vayaarivai nEDE naTanamaaDi neevE nannu dOcinaavE! naa hRdayaMlO niduriMcE celii! nee kannulalOna - daagenulE vennelasOna cakOramai ninu variMci anusariMcinaanE kalavariMcinaanE naa hRdayaMlO niduriMcE celii! naa gaanamulO neevE praaNamugaa pulakariMchinaavE (2) pallavigaa palukariMcharaavE (2) nee veccani neeDa - velasenu naa valapula mEDa veccani neeDa - velasenu naa valapula mEDa nivaaLitO chEyi chaachi edurucoocinaanE nidura kaacinaanE naa hRdayaMlO niduriMcE celii! | |
రక్తసంబంధం, ఇదే రక్తసంబంధం హృదయాలను కలిపేది, కలకాలం నిలిచేది నిజమైన జన్మబంధం, ఇదే రక్తసంబంధం చెల్లి సుఖమె తన సుఖమని ఎంచును చెల్లి కొరకు గుండెలు కరగించును తలిదండ్రి లేని లోపం తొలగించినాడు పాపం ఏనాటికైన గాని విడిపోని దివ్యబంధం, ఇదే రక్తసంబంధం ఒకే గూటిలోని చిన్నపిల్లలు ఒకరి విడిచి ఒకరు బ్రతుకనొల్లరు దేహాలు వేరు గాని హృదయాలు రెండు ఒకటే సుడిగాలులెన్ని రానీ తెగిపోని మధురబంధం, ఇదే రక్తసంబంధం హృదయాలను కలిపేది, కలకాలం నిలిచేది నిజమైన జన్మబంధం, ఇదే రక్తసంబంధం, ఇదే రక్తసంబంధం