Mana Ghantasala Song Lyrics

ingliishulOna mErEjii hindiilo arthamu SAdii

Movie:aarAdhana (1962)Lyrics:Arudra
Music:S. Rajeshwara RaoSingers:Ghantasala, Janaki
Submitted by: Panini

ఇంగ్లీశులోన మేరేజీ హిందీలొ అర్థము శాదీ (౨)

ఏ భాశలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

ఆహా . . .

ఓహో . . .



ప్రేమించుకున్న పెళ్ళిలోనే హాయి ఉందోయీ

పెద్దాళ్ళు దానికి సమ్మతిస్తే ఖాయమౌతుందోయ్

జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ (౨)

ఆ మాటకే నా గుండెలు గెంతేను త్రుళ్లి త్రుళ్లి (ఇంగ్లీశులోన)



న్యూఢిల్లినుండి సింగపూరు వెళ్ళిపోదాము

న్యూయార్కులోన డాన్సుచేస్తూ ఉండిపోదాము

కోశావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు (౨)

రంగేళికి సింగారికి రారాదు పాడు సిగ్గు (ఇంగ్లీశులోన)



పొంగేను సోడాగ్యాసు లాగా నేడు నీ మనసు

మా నాన్న ముఖము చూడగానే నువ్వు సైలెన్సు

తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు (౨)

నీమాటలే నిజమైనచో మన లైఫు నైసు నైసు (ఇంగ్లీశులోన)

ఆహా . . .

ఓహో . . .