Mana Ghantasala Song Lyrics

Ohoho mAmayyA idEmayyA balebale bAgA undayyA

Movie:aarAdhana (1962)Lyrics:aarudra
Music:#S#. rAjESwararAvuSingers:suSiila, ghaMTasaala
Submitted by: Panini

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా, బలెబలె బాగా ఉందయ్యా (౨)

ఇంటిని విడిచి శికారు కొడితే ఎంతో హాయి కలదయ్యా

ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి (౨)

మాటలు రాని మృగాలు కొన్ని మనిశికి పాఠం చెబుతాయి



పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగిన ప్రమాదమే, ఓ మావయ్యా మావయ్యా

కొందరు ఘరాన మనుశులకన్నా క్రూరము కావీ జంతువులు, ఓ అమ్మాయీ, అమ్మాయీ

శౌర్యం పెరిగిన మనిశిని మృగాన్ని కటకటాలలో పెడతారు  (ఓహొహొ మావయ్యా)



గుర్రపు అంశం గాడిద వంశం చారల చారల జీబ్రావి

చుక్కల జిరాఫి ఒంటెకు బంధువు, మనిశికి బంధువు చింపంజి

మనిశి చేశ్టలు కోతులకుంటే .. కోతి చేశ్టలు కొందరివి

హా‍ (ఓహొహొ అమ్మాయీ)



తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది, ఓ మావయ్యా, మావయ్యా

ఏనుగు వంటిది నీటిగుర్రము, దానికి తమ్ముడు ఖడ్గమృగం

అధికులు పేదల కాల్చుకు తింటే, ఇవి ఆకూఅలమే తింటాయి (ఓహొహొ మామయ్యా)



రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా

రోజులు మారాయ్‍ రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు, ప్రజలే ప్రభువులు ఈనాడు

మనుశుల పైన సవారికన్నా ఏనుగు సవారి నయం కదా

ఆ నిజం నిజం

అహ మజా మజా

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా, బలెబలె బాగా ఉందయ్యా

ఓహొహొ అమ్మాయీ ఇది కాకేజీ, బలెబలె బతికిన కాలేజి