Mana Ghantasala Song Lyrics

evarikOsaM, evarikOsaM, ee prEmamandiraM

Movie:prEM^nagar (1971)Lyrics:Athreya
Music:K.V. MahadevanSingers:Ghantasala
Submitted by: Panini
(నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, DoM't care) (2)

(నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి) (2)
నెను ఆడితే అందరి కాళ్ళూ నాతో కలిసాయి (2)
తెల్లవారితే వెనకల చేరి నవ్వుకుంటాయి, DoM't care
నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది

మనసును దాచేటందుకె పైపై నవ్వులు ఉన్నాయి
మనిషికి లేనీ అందం కోసమె రంగులు ఉన్నాయి
ఎరగక నంమిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి (2)
ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి, DoM't care
నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది

మనిషి మనిషినీ కలిపేటందుకె పెదవులు ఉన్నాయి
పెదవులు మధురం చేసేటందుకె మధువులు ఉన్నాయి
బాధలన్నీ బాటిల్‌ లో నేడే దింపేసెయ్‌ (2)
అగ్గిపుల్ల గీచేసెయ్‌, నీలో సైతాం తరిమేసెయ్‌, Drive the devil out
నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, DoM't care


(nEnu puTTAnu lOkaM mecciMdi, nEnu EDcAnu lOkaM navviMdi
nEnu navvAnu ii lOkaM EDciMdi, nAkiMkA lOkaMtO pani EmuMdi, #DoM't care#) (2)

(nEnu tAgitE koMdari kaLLu giragira tirigAyi
nEnu pADitE aMdari nOLLu vaMtalu pADAyi) (2)
nenu aaDitE aMdari kALLU nAtO kalisAyi (2)
tellavAritE venakala cEri navvukuMTAyi, #DoM't care#
nEnu puTTAnu lOkaM mecciMdi, nEnu EDcAnu lOkaM navviMdi
nEnu navvAnu ii lOkaM EDciMdi, nAkiMkA lOkaMtO pani EmuMdi

manasunu dAcETaMduke paipai navvulu unnAyi
manishiki lEnii aMdaM kOsame raMgulu unnAyi
eragaka naMmina vALLa nettikE cEtulu vastAyi (2)
eduTi manishiki ceppETaMduke niitulu unnAyi, #DoM't care#
nEnu puTTAnu lOkaM mecciMdi, nEnu EDcAnu lOkaM navviMdi
nEnu navvAnu ii lOkaM EDciMdi, nAkiMkA lOkaMtO pani EmuMdi

manishi manishinii kalipETaMduke pedavulu unnAyi
pedavulu madhuraM cEsETaMduke madhuvulu unnAyi
bAdhalannii bATil lO nEDE diMpEsey (2)
aggipulla giicEsey, niilO saitAM tarimEsey, #Drive the devil out#
nEnu puTTAnu lOkaM mecciMdi, nEnu EDcAnu lOkaM navviMdi
nEnu navvAnu ii lOkaM EDciMdi, nAkiMkA lOkaMtO pani EmuMdi, #DoM't care#



ఎవరికోసం, ఎవరికోసం, ఈ ప్రేమమందిరం, ఈ శూన్యనందనం

ఈ భగ్నహృదయం, ఈ అగ్నిగుండం

ఎవరికోసం (౪)



ప్రేమభిక్శ నువ్వే పెట్టి, ఈ పేదహృదయం పగులగొట్టి

పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు

నువ్వివ్వనిది దాచలేను, ఇంకెవ్వడినీ అడుగలేను

బ్రతుకు నీకు ఇచ్చాను, చితిని నాకు పేర్చావు (ఎవరికోసం)



ఓర్వలేని ఈ ప్రకృతి ప్రళయంగా మారనీ

నా దేవి లేని ఈ కోవెల తునాతునకలైపోనీ

కూలిపోయి ధూళిలో కలసిపోనీ, కాలిపోయి బూడిదే మిగలనీ (ఎవరికోసం)



మమత నింపమన్నాను, మనసు చంపుకున్నావు

మధువు తాగనన్నాను, విశం తాగమన్నావు

నీకు ప్రేమంటే నిజం కాదు, నాకు చావంటే భయం లేదు

నీ విరహంలో బ్రతికాను, ఈ విశంతో మరణిస్తాను, మరణిస్తాను

ఎవరికోసం