Mana Ghantasala Song Lyrics

Movie:nityakalyaaNaM pachchatOraNaMLyrics:Arudra
Music:PendyalaSingers:Ghantasala
Submitted by: Panini

టనానా టముకు చలో రాజా టముకుచలో

ఎద్దుబండి పాతదాయె జటకా ఇరకాటమాయె



సైకిల్ తొక్కాలంటే సత్తువ కావాలోయీ 

బస్సుకోసం కాచుకుంటే పనులు తుస్సుమంటాయోయ్

రిక్శాబండి మాత్రం పైసలు తక్కువలోనే జల్సా (టనానా)



పుటకముందు కడుపులోన తల్లి నిన్ను మోసింది

నడకరాని వయసులోన నలుగురెత్తుకున్నారు

పెట్టిపుట్టినోళ్లంటే నడవలేని పసివాళ్ళే (టనానా)



కలిగినోళ్లు ఎప్పుడూ తమ కాళ్లమీద నిలబడరోయ్

ఎక్కినోళ్ల ఎక్కువేంటి మోసినోళ్ల తక్కువేంటి

సాటి మనిశి లాగినపుడు సవారి అనుకోవోయ్

తోటిమనిశి సుఖాలకై తోడుపడుట మంచిదోయ్

అంతా అందలమెక్కితె అసలు మోసేదెవరోయ్ (టనానా)