Mana Ghantasala Song Lyrics

vEdamlaa gOdaavari

Movie:PrivateLyrics:aarudra
Music:GhantasalaSingers:Ghantasala
Submitted by: Sreenivas Paruchuri

వేదంలా గోదావరి ప్రవహిస్తోందే చెల్లీ

వెన్నెలవలె కృశ్ణవేణి విహరిస్తోందే తల్లీ



విశాలాంధ్ర నలుముఉలల వైవాహిక వైభోగం

జనుల కనుల వెలుగులలో జాజులువారెడి రాగం



గెలవేసిన అరటిచెట్లు తీసుకురానా తల్లీ

ఎలమామిడి తోరణాలు కట్టనా చెల్లీ



గడపమీద చిగురు జల్ల గరిపొడిచెను శోభ

ముంగిట ముత్యాలు నవ్వ రంగవల్లి సుప్రభ



ఏరువాక పడవలాగ ఎద ఊగిసలాడునే

జోడెద్దుల బండివలె గుండెలురికి సాగునే



కల్యాణతిలక రేఖగ కస్తుఉరి బొట్టు దిద్దవే

తెలుగు వెలది బుగ్గమీద దిశ్టిచుక్క పెట్టవే



తలంబ్రాలు తనిసినటుల ధరణి తోచునే చెల్లీ

వసంతాల తడిసినటుల సంజ మెరయునే తల్లీ



జనావళికి సంతతం సంతోశ ప్రాప్తి

విశాలాంధ్ర నిండా వైవాహిక దీప్తి



తుత్తార మాదిరిగా తుంగభద్ర నాదమే

సన్నాయికి మల్లే పెన్నానది గానమే