Mana Ghantasala Song Lyrics

talaniMDa poodaMDa daalchina raaNi

Movie:PrivateLyrics:dASaradhi
Music:GhantasalaSingers:Ghantasala
Submitted by: Sreenivas Paruchuri
తలనిండ పూదండ
ఆ రజనీకర మోహన బింబము
నీ నగుమోమునకు బోలునటే
కొలనిలోని నవకమల దళంములు
నీ నయనముల బోలునటె
ఎచట జూచిన యెచట వేచిన
నీ రూపమదే కనిపించినదే
తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే
పూల వానలు కురియు మొయిలువో
మొగలిరేకుల లోని సొగసువో నా రాణి "తలనిండ"
నీ మాట బాటలో నిండె మందారాలు
నీ పాట తోటలో నిగిడే శృంగారాలు
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు
నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు "తలనిండ"


talaniMDa pUdaMDa
aa rajaniikara mOhana biMbamu
nii nagumOmunaku bOlunaTE
kolanilOni navakamala daLaMmulu
nii nayanamula bOlunaTe
ecaTa jUcina yecaTa vEcina
nii rUpamadE kanipiMcinadE
talaniMDa pUdaMDa dAlcina rANi
molaka navvula tODa muripiMcabOkE
poola vAnalu kuriyu moyiluvO
mogalirEkula lOni sogasuvO nA rANi            "talaniMDa"
nii mATa bATalO niMDe maMdArAlu
nii pATa tOTalO nigiDE SRngArAlu
nii mEnilO pacca cEmaMti aMdAlu
nii niilavENilO nilicE aakASAlu               "talaniMDa"