Mana Ghantasala Song Lyrics

Movie:chilakaa gOriMkaLyrics:SreeSree
Music:S. Rajeshwara RaoSingers:Ghantasala
Submitted by: Sreenivas Parichuri
ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొరపు గరపు
ఎవ్వాని కడకంట నివ్వటిల్లెడుచూడ్కి మానిత సంపదలీనుచుండు
ఎవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు

అతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీరకోటీరమణి ఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడై ధర్మసుతుడు


evvAni vAkiTa ibhamada paMkaMbu rAjabhUshaNa rajOrAjinaDagu
evvAni cAritra mellalOkamulaku nojjayai vinayaMbu norapu garapu
evvAni kaDakaMTa nivvaTilleDucUDki mAnita saMpadaliinucuMDu
evvAni guNalata lEDu vArAsula kaDapaTi koMDapai kalayabrAku

ataDu bhUripratApa mahApradiipa
dUra vighaTita garvAMdhakAra vairi
viirakOTiiramaNi ghRNi vEshTitAMghri
taluDu kEvala martyuDai dharmasutuDu



నా  రాణి  కనులలోనే ఆనాటి కలలు దాగే (౨)

ఊరించు తొలిదినాలే ఈరేయి పిలువసాగే (నా రాణి)



నగుమోము చూడబోయి నిను చేరనా ఈరేయి

నను క్రీగంటనే కని ఆవెంటనే ~చని దూరాన దాగుంటివే (నా రాణి)



సిగలోన మల్లెపూల సవరించబోవు వేళ

మది గిలిగింతగా చెయి విదిలింతగా ఎద నిను కోరి పులకించెనే (నా రాణి)



పడకింటిశయ్య చెంత నీ మేను తాకినంత

మన గీతాలలో జలపాతాలలో నవరాగాలు మ్రోగేనులే (నా రాణి)