| Movie:nartanaSAla (1963) | Lyrics:tikkana - SrImadaandhra mahAbhAratamu |
| Music:susarla daxiNAmUrti | Singers:ghaMTasaala, jAnaki |
| Submitted by: Sreenivas Paruchuri |
కాంచన మయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు
సింహ లాంగూల భూశిత నభోభాగ కేతుప్రేంఖణము వాడు ద్రోణ సుతుడు
కనక గోవృశ సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబు వాడు కృపుడు
లలిత కంబు ప్రభా కలిత పతాక విహారంబు వాడు రాధాత్మజుండు
మణీ మయోరగ రుచి జాల మహితమైన
పడగవాడు కురుక్షితిపతి
శిఖర ఘన తాళ తరువగు సిడము వాడు
సుర నదీ సూనుడేర్పడ జూచికొనుము
ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రా బుర వీధుల గ్రాలగలదె?
మణిమయంబైన భూశణ జాలముల నొప్పి యొడ్డోరగంబుల నుండగలదె?
కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింప గలదె?
అతి మనోహరలగు చతురాంగనల తోడ సంగతి వేడ్కలు సలుప గలడె?
కయ్యమున నోడి పోయిన కౌరవేంద్రా
నిలుము నా బుద్ధి వీడి ఈ తనువు విడిచి
సుగతి బడయుము తొల్లింట చూర గలదె?
జూదమిక్కడ నాడంగ రాదు సుంము
|