పాడుతా తీయగా సల్లగా (౨)
పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా
పాడుతా తీయగా సల్లగా
(కునుకు పడితె మనసు కాస్త కుదుటపడతది
కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది) (౨)
కలలె మనకు మిగిలిపోవు కలిమి సివరకు (౨)
ఆ కలలు కూడ దోసుకొనే దొరలు ఎందుకు
(పాడుతా తీయగా సల్లగా)
(గుండెమంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు) (౨)
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు (౨)
ఉన్నొళ్ళు పొయినోళ్ళ తీపిగురుతులు
(పాడుతా తీయగా సల్లగా)
(మణిసి పోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసుతోటి మనసెపుడో కలసిపోతది) (౨)
సావుపుటక లేనిదమ్మ నేస్తమన్నది (౨)
జనమ జనమకది మరీ గట్టిపడతది
(పాడుతా తీయగా సల్లగా)
|