|
Mana Ghantasala Song LyricsE nimishAniki yEmi jarugunO evarUhiMchedaru |
| Movie:lavakuSa (1963) | Lyrics:samudrAla #Sr.# |
| Music:ghaMTasaala | Singers:ghaMTasaala |
| Submitted by: Neeraja | |
|
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు? విధివిధానమును తపించుటకై ఎవరు సహసించెదరు (ఏ నిమిషానికి) కంచెయె నిజముగ చేనుమేసిన కాదనువారెవరూ రాజే ఇది శాశనమని పల్కిన ప్రతిఘటించువారెవరూ (ఏ నిమిషానికి) కరుణామయులు ఇది కాదనలేర కట్టిన కార్యమనబోర సాధ్వులకేపుడు వెతలేనా తీరని దుఖపు కథలేనా.. (ఏ నిమిషానికి) ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా.. (ఏ నిమిషానికి) ఎండకన్ను యెరుగని ఇల్లలికి ఎందుకో ఈ వనవాసాలు తరచి చూచినా బోధపడవులే దైవ చిద్విలాశాలూ.. (ఏ నిమిషానికి) అగ్నిపరీక్షకే నిలిచిన సాద్విని ఆనుమానించుట న్యయమా అలుపుని మాటయె జనవక్యమని(2) అనుసరించుటయె ధర్మమా (ఏ నిమిషానికి) | |
E nimishAniki Emi jarugunO evarUhiMcedaru? vidhividhaanamunu tapiMchuTakai evaru sahasiMchedaru (E nimishAniki) kaMceye nijamuga chEnumEsina kAdanuvArevarU rAjE idi SASanamani palkina pratighaTiMcuvArevarU (E nimishaaniki) karuNaamayulu idi kaadanalEra kaTTina kaaryamanabOra saadhvulakEpuDu vetalEnaa tIrani dukhapu kathalEnaa.. (E nimishaaniki) inakulamuna janiyiMcina nRpatulu ii dAruNamu sahiMcedarA vinuvIdhini SrENulugA nilci viDDUramugA cUcedarA.. (E nimishaaniki) eMDakannu yerugani illaliki eMdukO ii vanavAsAlu taraci cUcinA bOdhapaDavulE daiva cidvilASAlU.. (E nimishAniki) agniparIkshakE nilichina saadvini aanumaaniMchuTa nyayamaa alupuni maaTaye janavakyamani(2) anusariMchuTaye dharmamaa (E nimishaaniki) | |