![]() |
Mana Ghantasala Song Lyricsparuguli tiyyAli gittalu urakalu veyyAli |
Movie:malleeSwari | Lyrics:Devulapalli Krishna Sastry |
Music:S. Rajeswara Rao | Singers:Ghantasala and P. Bhanumathi |
Submitted by: Neeraja | |
పరుగులు తియ్యాలి గిత్తలు ఉరకలు వెయ్యాలి బిర బిర జర జర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి ఓ.. హొరుగాలి కారు మబ్బులు ముసిరేలోగా మూగేలోగా ఊరు చేరాలి మన ఊరు చేరాలి గలగల గలగల కొమ్ముల గజ్జెలు గణగణ గణగణ మెళ్ళో గంటలు ఆ.. వాగులు దాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలి ఆ.. అవిగో అవిగో నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో అవిగో పచ్చని తోటలు విచ్చిన పూవ్వులు ఊగే గాలుల తూగే తీగలు అవిగో కొమ్మల మోగే కోయిల జంటలు ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో అవిగో అవిగో ఆ.. | |
parugulu tiyyAli gittalu urakalu veyyaali bira bira jara jara paruguna paruguna Uru chEraali mana Uru chEraali O.. horugaali kaaru mabbulu musirElOgaa mUgElOgA Uru chErAli mana Uru chErAli galagala galagala kommula gajjelu gaNagaNa gaNagaNa meLLO gaMTalu aa.. vaagulu daaTi vaMkalu daaTi Uru chErAli mana Uru chErAli aa.. avigO avigO nallani mabbulu guMpulu guMpulu tellani koMgalu bArulu bArulu avigO avigO avigO avigO pacchani tOTalu vicchina pUvvulu UgE gaalula tUgE tIgalu avigO kommala mOgE kOyila jaMTalu jhummani mUgE tummeda guMpulu avigO avigO avigO avigO aa.. |