![]() |
Mana Ghantasala Song Lyricsee pagalu rEyigaa paMDu vennelaga maarinadEmi celee aa kaaraNamEmi celee |
Movie:siri saMpadalu | Lyrics: |
Music:peMDyaala | Singers:ghaMTasaala, jaanaki |
Submitted by: Ravi Manda | |
ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ ఆ కారణమేమి చెలీ వింతకాదు నా చెంతనున్నదీ వెండి వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవులమీదికి రానీవు (2) పెదవికదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు (వెండి వెన్నెల) కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చి ఏమార్చేవు (2) చెంపలు పూచే కెంపులు నాతో నిజముతెలుపునని జడిసేవు (వెండి వెన్నెల) అలుకచూపి అటువైపుతిరిగితే అగుపడదనుకొని నవ్వేవు (2) నల్లనిజడలో మల్లెపూలు నీ నవ్వునకద్దము చూపేను (వెండి వెన్నెల) | |
ee pagalu rEyigaa paMDu vennelaga maarinadEmi celee aa kaaraNamEmi celee viMtakaadu naa ceMtanunnadee veMDi vennela jaabili niMDu punnami jaabili manasuna toNikE cirunavveMduku pedavulameediki raaneevu (2) pedavikadipitE madilO medilE maaTa teliyunani maanEvu (veMDi vennela) kannulu telipE kathalaneMduku reppalaarci EmaarcEvu (2) ceMpalu poocE keMpulu naatO nijamutelupunani jaDisEvu (veMDi vennela) alukacoopi aTuvaiputirigitE agupaDadanukoni navvEvu (2) nallanijaDalO mallepoolu nee navvunakaddamu coopEnu (veMDi vennela) |