|
Mana Ghantasala Song LyricspaaDavOyi bhaarateeyuDaa aaDipaaDavOyi vijayageetika (2) |
| Movie:veluguneeDalu | Lyrics:Sree Sree |
| Music:ghaMTasaala | Singers:suSeela, ghaMTasaala |
| Submitted by: Ravi Manda | |
|
పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి విజయగీతిక (2) నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం (2) నేడే నవోదయం నీదే ఆనందం (పాడవోయి భారతీయుడా) స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి సంబరపడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతిదారుల (2) ఆకాశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపు (2) అవినీతి బంధుప్రీతి చీకటిబజారు అలముకొన్న ఈదేశం ఎటుదిగజారు కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితీ (2) పదవీవ్యామోహాలు కులమతభేదాలు భాషాద్వేషాలు చెలరేగే నేడు (2) ప్రతిమనిషి మరియొకని దోచుకొనే వాడే (2) తనసౌఖ్యం తనభాగ్యం చూసుకొనే వాడే స్వార్ధమే అనర్ధ కారణం అది చంపుకొనుటే క్షేమదాయకం (2) సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం నీధ్యేయం సకలజనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం (2) ఏకదీక్షతో గంయంచేరిననాడే లోకానికి మనభారతదేశం అందించునదే శుభసందేశం | |
paaDavOyi bhaarateeyuDaa aaDipaaDavOyi vijayageetika (2) nEDE svaataMtryadinaM veerula tyaagaphalaM (2) nEDE navOdayaM needE aanaMdaM (paaDavOyi bhaarateeyuDaa) svaataMtryaM vaccenanee sabhalEcEsi saMbarapaDagaanE saripOdOyi saadhiMcina daaniki saMtRptini poMdi adE vijayamanukuMTE porapaaTOyi aagakOyi bhaarateeyuDaa kadali saagavOyi pragatidaarula (2) aakaaSaM aMdukonE dharalokavaipu adupulEni nirudyOgamiMkokavaipu (2) avineeti baMdhupreeti ceekaTibajaaru alamukonna eedESaM eTudigajaaru kaaMcavOyi nETi dusthiti ediriMcavOyi ee paristhitee (2) padaveevyaamOhaalu kulamatabhEdaalu bhaashaadvEshaalu celarEgE nEDu (2) pratimanishi mariyokani dOcukonE vaaDE (2) tanasaukhyaM tanabhaagyaM cUsukonE vaaDE svaardhamE anardha kaaraNaM adi caMpukonuTE kshEmadaayakaM (2) samasamaaja nirmANamE nee dhyEyaM needhyEyaM sakalajanula saubhaagyame nee lakshyaM nee lakshyaM (2) EkadeekshatO gaMyaMcErinanADE lOkaaniki manabhaaratadESaM aMdiMcunadE SubhasaMdESaM | |