Mana Ghantasala Song Lyrics

niluvumaa niluvumaa

Movie:amaraSilpi jakkanaLyrics:samudraala seeniyar
Music:rAjESvara raavuSingers:suSeela, ghaMTasaala
Submitted by: Ravi Manda
నిలువుమా నిలువుమా
నిలువుమా నిలువుమా నీలవేణి నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ (నిలువుమా నిలువుమా)

అడుగడున ఆడే లే నడుము సొంపులా (2) తడబడే అడుగుల నటనల మురిపింపుల (2)
సడిసేయక ఊరించే వయ్యారపు వొంపుల
కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా నడచిరా నడచిరా నాగవేణి
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ (నిలువుమా నిలువుమా)

అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ
అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి (2)
నా ఊర్వశి రావే రావేయని పిలువనా (2)
ఆ సుందరి నెఱనీకు నీగోటికి సమమౌనా
రాచెలీ నినుమదీ దాచుకోనీ (2)
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ (నిలువుమా నిలువుమా)





niluvumaa niluvumaa
niluvumaa niluvumaa neelavENi  nee kanula neelineeDa naa manasU nidurapOnee   (niluvumaa niluvumaa)

aDugaDuna aaDE lE naDumu soMpulaa (2)  taDabaDE aDugula  naTanala muripiMpula (2)
saDisEyaka UriMcE   vayyaarapu voMpula
kaDakannula iMpula  gaDasari kavviMpulaa  naDaciraa naDaciraa naagavENi
nee kanula neelineeDa naa manasU nidurapOnee   (niluvumaa niluvumaa)

addamulO  nee celuvu tilakiMpaku prEyasee
aligEvu nee saaTi celigaa talabOsi (2)
naa UrvaSi raavE raavEyani piluvanaa (2)
aa suMdari ne~raneeku  neegOTiki samamaunaa
raacelee ninumadee daacukOnee (2)
nee kanula neelineeDa naa manasU nidurapOnee   (niluvumaa niluvumaa)





EDIT