Mana Ghantasala Song Lyrics

nElatO neeDa annadi nanu taakaraadani

Movie:maMci rOjuluLyrics:Sree Sree
Music:maashTar vENuSingers:ghaMTasaala
Submitted by: Ravi Manda
నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని గడ్డిపఱక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది

వేలికొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా
తల్లితండ్రి ఒకరినొకరు తాకనిదే
నీవులేవు నేనులేను (2) లోకమే లేదులే (నేలతో నీడ అన్నది )

రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా
మధుకుంతం తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదు మనిషి లేడు (2) మనుగడయే లేదులే (నేలతో నీడ అన్నది )

అంటరానితనము ఒంటరితనము అనాదిగా మీజాతికి అదే మూలధనము (2)
ఇక సమభావం సమధర్మం సహజీవనమనివార్యం
తెలుసుకొనుట నీ ధర్మం తెలియకుంటే నీ ఖర్మం (నేలతో నీడ అన్నది )





nElatO neeDa annadi  nanu taakaraadani
pagaTitO rEyi annadi  nanu taakaraadani
neeru tannu taakaraadani gaDDipa~raka annadi
nEDu bhartanE taakaraadani   oka bhaarya annadi

vElikosalu taakanidE veeNa paaTa paaDEnaa
callagaali taakanidE nallamabbu kurisEnaa
tallitaMDri okarinokaru taakanidE
neevulEvu  nEnulEnu (2) lOkamE lEdulE   (nElatO neeDa annadi )

ravikiraNaM taakanidE navakamalaM virisEnaa
madhukuMtaM taakanidE maMdaaraM murisEnaa
mEnu mEnu taakanidE  manasu manasu kalavanidE
mamata lEdu  manishi lEDu (2)  manugaDayE lEdulE   (nElatO neeDa annadi )

aMTaraanitanamu oMTaritanamu  anaadigaa meejaatiki adE mUladhanamu (2)
ika samabhaavaM samadharmaM  sahajeevanamanivaaryaM
telusukonuTa nee dharmaM  teliyakuMTE nee kharmaM   (nElatO neeDa annadi )





EDIT