Mana Ghantasala Song Lyrics

cilipikanula teeyani celikaaDaa

Movie:kulagOtraalu (1962)Lyrics:?
Music:#S#. raajESwararaavuSingers:suSeela, ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri


ఆమె: ఓ . . ఆ ఆ ఆ . . ఓ . .
చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా, నిలుపుకొందురా వెల్గులమేడ
అతడు: నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట _నిలుపుకొందునే పూల ఉయాల

(ఆమె: కనులముందు అలలు పొంగెనూ
అతడూ: ఓ . . .
ఆమె: మనసులోన కలలు పండెనూ . .) (2)
(అతడు: అలలే కలలై
ఆమె: కలలే అలలై) (2)
అతడు: గిలిగింతలు సలుపసాగెనూ . .
ఆమె: చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ

(అతడు: కొండలు కోయని పిలిచినవీ
ఆమె: ఆ . . .
అతడు: గుండెలు హోయని పలికినవీ) (2)
ఆమె: కోరికలన్నీ బారులుతీరీ (2)
గువ్వలుగా ఎగురుతున్నవీ . .
అతడు: నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయాల

(ఆమె: జగము మరచి ఆడుకొందమా
అతడు: ఆ . . .
ఆమె: ప్రణయగీతి పాడుకొందమా) (2)
అతడు: నింగీ నేలా కలిసిన చోటా (2)
నీవు నేను చేరుకొందమా . .
ఆమె: చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ
అతడు: ఓ . . .
జంటగ:ఓ . . .




aame:    O . . aa aa aa . . O . .
         cilipikanula teeyani celikaaDaa
         nee neeDanu nilupukoMduraa, nilupukoMduraa velgulamEDa
ataDu:  neelikurula vannela javaraalaa
        nee kougiTa _nilupukoMdunE poola uyaala

(aame:   kanulamuMdu alalu poMgenoo
ataDoo:  O . . .
aame:    manasulOna kalalu paMDenoo . .) (2)
(ataDu: alalE kalalai
aame:    kalalE alalai) (2)
ataDu:  giligiMtalu salupasaagenoo . .
aame:    cilipikanula teeyani celikaaDaa
         nee neeDanu nilupukoMduraa velgulamEDa

(ataDu: koMDalu kOyani pilicinavee
aame:    aa . . .
ataDu:  guMDelu hOyani palikinavee) (2)
aame:    kOrikalannee baaruluteeree (2)
         guvvalugaa egurutunnavee . .
ataDu:  neelikurula vannela javaraalaa
        nee kougiTa nilupukoMdunE poola uyaala

(aame:   jagamu maraci aaDukoMdamaa
ataDu:  aa . . .
aame:    praNayageeti paaDukoMdamaa) (2)
ataDu:  niMgee nElaa kalisina cOTaa (2)
        neevu nEnu cErukoMdamaa . .
aame:    cilipikanula teeyani celikaaDaa
         nee neeDanu nilupukoMduraa velgulamEDa
ataDu:  O . . .
jaMTaga:O . . .


EDIT