|
Mana Ghantasala Song LyricsaDigiMdaaniki ceppi eduraaDaka praSnanu vippi |
| Movie:illarikam (1958) | Lyrics:kosaraaju (?) |
| Music:#T# calapatiraavu | Singers:ghaMTasaala |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా అడిగిందానికి చెపుతా ఎంతైనా పందెం గడతా నిల్చెదనోయ్ గెల్చెదనోయ్ ఓహో చిన్నవాడా ఒంటికాలిపై నుండి హఠ యోగ ముద్రలో నుండి (2) గుట్టుగ తన పని సాధించునది వివరిస్తావా ఏదది (అడిగిందానికి చెప్పి...) ముక్కు మూరెడే యౌను అది కొక్కుకు మని గొణిగేను (2) కొంగ జపమని ప్రసిద్ధియేను ముందుకు వచ్చి కాదను (అడిగిందానికి చెపుతా...) వాయువేగమును మించి లోకాలన్ని గాలించి (2) గడియలోననే ఉన్న చోటికే వడిగా చేరేదేదది (అడిగిందానికి చెప్పి...) రాకెట్టని అనుకోను అది స్పూట్నిక్ అనలేను (2) ముమ్మాటికి అది మనసేను ముందుకు వచ్చి కాదను అడిగిందానికి చెపుతా.. దానమిచ్చి చెడెనెవ్వడు కర్ణుడు కర్ణుడు తప్పు తప్పు బలి చక్రవర్తి హే బలి చక్రవర్తి జూదానికి నిపుణుండెవ్వడు ధర్మజుడు ధర్మజుడు తప్పు తప్పు శకుని హే శకుని అన్నదమ్ముల పోరాటంలో సందు జూచుకొని కూల్చిందెవడు భీముడు భీముడు తప్పు తప్పు రాముడు హే రాముడు శ్రీ రాముడు శ్రీ రాముడు........ | |
aDigiMdaaniki ceppi eduraaDaka praSnanu vippi
nilcedavaa gelcedavaa OhO cinnadaanaa
aDigiMdaaniki ceputaa eMtainaa paMdeM gaDataa
nilcedanOy gelcedanOy OhO cinnavaaDaa
oMTikaalipai nuMDi haTha yOga mudralO nuMDi (2)
guTTuga tana pani saadhiMcunadi vivaristaavaa Edadi
(aDigiMdaaniki ceppi...)
mukku mooreDE younu adi kokkuku mani goNigEnu (2)
koMga japamani prasiddhiyEnu muMduku vacci kaadanu
(aDigiMdaaniki ceputaa...)
vaayuvEgamunu miMci lOkaalanni gaaliMci (2)
gaDiyalOnanE unna cOTikE vaDigaa cErEdEdadi
(aDigiMdaaniki ceppi...)
raakeTTani anukOnu adi spUTnik analEnu (2)
mummaaTiki adi manasEnu muMduku vacci kaadanu
aDigiMdaaniki ceputaa..
daanamicci ceDenevvaDu
karNuDu
karNuDu
tappu tappu bali cakravarti
he' bali cakravarti
joodaaniki nipuNuMDevvaDu
dharmajuDu
dharmajuDu
tappu tappu Sakuni
he' Sakuni
annadammula pOraaTaMlO saMdu joocukoni koolciMdevaDu
bheemuDu
bheemuDu
tappu tappu raamuDu
he' raamuDu Sree raamuDu Sree raamuDu........
| |