Mana Ghantasala Song Lyrics

niluvavE vaalu kanuladaana

Movie:illarikam (1958)Lyrics:kosaraaju (?)
Music:#T# calapatiraavuSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
నిలువవే వాలు కనులదాన
వయ్యారి హంస నడకదాన
నీ నడకలో హొయలున్నవె చాన
నువు కులుకుచు గల గల నడుస్తు ఉంటే
నిలువదె నా మనసు ఓ లలనా
అది నీకే తెలుసు "నిలువవె"

ఎవరనీ ఎంచుకొనినావో
పరుడనీ భ్రాంతి పడినావో
ఎవరనీ ఎంచుకొనినావొ భ్రాంతి పడినావొ
సిగ్గుపడి తొలగేవో
విరహాగ్నిలో నను తోసి పోయేవో "నువు"

ఒకసారీ నన్ను చూడరాదా
చెంతజేర సమయమిది కాదా
ఒకసారీ నన్ను చూడ రాద సమయమిది కాద
చాలు నీ మరియాదా
వగలాడి నే నీవాడనే కాదా "నువు"

మగడంటే మోజు లేని దానా
మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజు లేని దాన నీకు నేను లేన
కోపమా నాపైనా
నీ నోటి మాటకు నోచుకోలేనా

నిలువవే వాలు కనులదాన
వయ్యారి హంస నడకదాన
నీ నడకలో హొయలున్నదె చాన
నువు కులుకుచు గల గల నడుస్తు ఉంటే
నిలువదె నా మనసు
ఓ లలనా ఓ చెలియా ఓ మగువా
అది నీకే తెలుసు


        niluvavE vaalu kanuladaana
        vayyaari haMsa naDakadaana
        nee naDakalO hoyalunnave caana
        nuvu kulukucu gala gala naDustu uMTE
        niluvade naa manasu o' lalanaa
        adi neekE telusu                                "niluvave"

        evaranee eMcukoninaavO
        paruDanee bhraaMti paDinaavO
        evaranee eMcukoninaavo bhraaMti paDinaavo
        siggupaDi tolagEvO
        virahaagnilO nanu tOsi pOyEvO                    "nuvu"

        okasaaree nannu cooDaraadaa
        ceMtajEra samayamidi kaadaa
        okasaaree nannu cooDa raada samayamidi kaada
        caalu nee mariyaadaa
        vagalaaDi nE neevaaDanE kaadaa                      "nuvu"

        magaDaMTE mOju lEni daanaa
        manasuMTE neeku nEnu lEnaa
        magaDaMTE mOju lEni daana neeku nEnu lEna
        kOpamaa naapainaa
        nee nOTi maaTaku nOcukOlEnaa

        niluvavE vaalu kanuladaana
        vayyaari haMsa naDakadaana
        nee naDakalO hoyalunnade caana
        nuvu kulukucu gala gala naDustu uMTE
        niluvade naa manasu
        O lalanaa O celiyaa O maguvaa
        adi neekE telusu


EDIT