|
Mana Ghantasala Song LyricsprEmayaatralaku bRMdaavanamu |
| Movie:guMDamma katha (1962) | Lyrics:Pingali Nagendra Rao |
| Music:Ghantasala | Singers:Ghantasala. Suseela |
| Submitted by: Panini | |
|
ప్రేమయాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో (2) ప్రేమయాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరమూ కాశీప్రయాగలేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో (2) తీర్థయాత్రలకు రామేశ్వరమూ కాశీప్రయాగలేలనో చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా (2) సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునె ఊటీ శాయగా (2) ప్రేమయాత్రలకు కొడైకెనాలూ కాశ్మీరాలూ ఏలనో కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా (2) పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా (2) తీర్థయాత్రలకు కైలాసాలూ వైకుంఠాలూ ఏలనో అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో | |
prEmayaatralaku bRMdaavanamoo naMdanavanamoo ElanO kulukuloluku celi ceMtanuMDagaa vErE swargamu ElanO (2) prEmayaatralaku bRMdaavanamoo naMdanavanamoo ElanO teerthayaatralaku raamESwaramoo kaaSeeprayaagalElanO prEmiMcina pati eduTanuMDagaa vErE daivamu ElanO (2) teerthayaatralaku raamESwaramoo kaaSeeprayaagalElanO celi nagumOmE caMdrabiMbamai pagalE vennela kaayagaa (2) sakhi nericoopula calladanaMtO jagamune ooTee Saayagaa (2) prEmayaatralaku koDaikenaaloo kaaSmeeraaloo ElanO kannavaarinE maruvajEyucoo anni muccaTalu teercagaa (2) pati aadaraNE satiki mOkshamani sarvaSaastramulu caaTagaa (2) teerthayaatralaku kailaasaaloo vaikuMThaaloo ElanO anyOnyaMgaa daMpatuluMTE bhuviki swargamE digiraadaa prEmayaatralaku bRMdaavanamoo naMdanavanamoo ElanO | |