![]() |
Mana Ghantasala Song LyricsdEvuDanEvaaDunnaaDaa ani manishiki kaligenu saMdEham (2) |
Movie:daaguDumootalu (1964) | Lyrics:aatrEya |
Music:#K.V.# mahadEvan | Singers:ghaMTasaala, suSeela |
Submitted by: Sreenivas Paruchuri | |
అతడు: దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం (2) ఆమె: మనుషులనేవారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం (2) అతడు: దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం అతడు: మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు ఆమె: ఆ దేవుడు కనబడలేదని మనిషి నాస్తికుడైనాడు (2) అతడు: దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం ఆమె: పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు (2) బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు (2) అతడు: బుద్ధికి హృదయం లేక, హృదయానికి బుద్ధే రాక (2) నరుడే ఈలోకం నరకం చేశాడు దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం అతడు: తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ (2) ఆమె: తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ (2) అతడు: నేను నవ్వితే ఈ లోకం చూడలేక ఏడ్చింది ఆమె: నేనేడిస్తే ఈ లొకం చూసిచూసి నవ్వింది అతడు: దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం ఆమె: మనుషులనేవారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం అతడు: దేవుడనేవాడున్నాడా | |
ataDu: dEvuDanEvaaDunnaaDaa ani manishiki kaligenu saMdEhaM (2) aame: manushulanEvaarunnaaraa ani dEvunikoccenu anumaanaM (2) ataDu: dEvuDanEvaaDunnaaDaa ani manishiki kaligenu saMdEhaM ataDu: manasulEni ee manishini cooci dEvuDu raayaipOyaaDu aame: aa dEvuDu kanabaDalEdani manishi naastikuDainaaDu (2) ataDu: dEvuDanEvaaDunnaaDaa ani manishiki kaligenu saMdEhaM aame: paSuvulakannaa pakshulakannaa manishini minnaga cESaaDu (2) buddhini icci hRdayaannicci bhoomE needani paMpaaDu (2) ataDu: buddhiki hRdayaM lEka, hRdayaaniki buddhE raaka (2) naruDE eelOkaM narakaM cESaaDu dEvuDanEvaaDunnaaDaa ani manishiki kaligenu saMdEhaM ataDu: taamu navvutoo navvistaaru koMdaru aMdarinee (2) aame: taamEDustoo EDpiMcutaareMdarO koMdarinee (2) ataDu: nEnu navvitE ee lOkaM cooDalEka EDciMdi aame: nEnEDistE ee lokaM coosicoosi navviMdi ataDu: dEvuDanEvaaDunnaaDaa ani manishiki kaligenu saMdEhaM aame: manushulanEvaarunnaaraa ani dEvunikoccenu anumaanaM ataDu: dEvuDanEvaaDunnaaDaa |