Mana Ghantasala Song Lyricsanaganagaa oka raaju anaganagaa oka raaNi (2) |
Movie:aatmabaMdhuvu (1962) | Lyrics:#C.# naaraayaNareDDi |
Music:#K.V.# mahadEvan | Singers:suSeela, ghaMTasaala |
Submitted by: Sreenivas Paruchuri | |
ఆమె: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి (2) రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న (2) అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అతడు: ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువుసంధ్యలుండికూడ చవటలయ్యారు, వొట్టి చవటలయ్యారు ఆమె: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అతడు: పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు అయ్యో ఇంటిదీపమార్పివేయ నెంచెనొక్కడు తల్లీతండ్రులు విషమని తలచెనొక్కడు (2) పడుచుపెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడూ, భ్రమసెనొక్కడు ఆమె: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అతడు: (కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను) (2) ఆమె: కంటిపాప కంటె ఎంతొ గారవించెను (2) దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను, తానుండసాగెను అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అతడు: (నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా) (2) కూరిమి గలవారంతా కొడుకులేనురా (2) జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా, కుక్క మేలురా జంటగ: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి | |
aame: anaganagaa oka raaju anaganagaa oka raaNi (2) raaju guNamu minna raaNi manasu venna (2) anaganagaa oka raaju anaganagaa oka raaNi ataDu: aa raajuku EDuguru koDukulunnaaru vaaru caduvusaMdhyaluMDikooDa cavaTalayyaaru, voTTi cavaTalayyaaru aame: anaganagaa oka raaju anaganagaa oka raaNi ataDu: paDakameeda tummamuLLu paracenokkaDu ayyO iMTideepamaarpivEya neMcenokkaDu talleetaMDrulu vishamani talacenokkaDu (2) paDucupeLLaamE bellamani bhramasenokkaDoo, bhramasenokkaDu aame: anaganagaa oka raaju anaganagaa oka raaNi raaju guNamu minna raaNi manasu venna anaganagaa oka raaju anaganagaa oka raaNi ataDu: (koDukulatO baaTu raaju kukkanu peMci prEmayanE paalu pOsi peMpu cEsenu) (2) aame: kaMTipaapa kaMTe eMto gaaraviMcenu (2) daani guMDelOna gooDu kaTTi uMDasaagenu, taanuMDasaagenu anaganagaa oka raaju anaganagaa oka raaNi raaju guNamu minna raaNi manasu venna anaganagaa oka raaju anaganagaa oka raaNi ataDu: (naadi naadi anukunnadi needi kaaduraa neevu raayannadi okanaaTiki ratnamounuraa) (2) koorimi galavaaraMtaa koDukulEnuraa (2) jaaliguMDe lEni koDukukanna kukka mEluraa, kukka mEluraa jaMTaga: anaganagaa oka raaju anaganagaa oka raaNi raaju guNamu minna raaNi manasu venna anaganagaa oka raaju anaganagaa oka raaNi |