|
Mana Ghantasala Song LyricsguTTugaa lEtaremmala kuluku ninnu |
| Movie:caduvukunna ammaayilu | Lyrics:? |
| Music:saaloori | Singers:ghaMTasaala, suSeela |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
అతడు: గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచు ఏల ఇట్టుల చింతింతువే టొమేటో అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . . ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసమూ ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి మధ్య నలిగినాడు మాధవుండు ఇద్దరతివలున్న ఇరకాటమేనయా విశ్వదాభిరామ వినుర వేమా, ఆ . . . ఆమె: ఆ . . ఓ . . అతడు: జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ ఆమె: ఆ . . . అతడు: చెలిమే వలపై మారితే, శివశివ మనపని ఆఖరే ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసమూ ఆమె: ఓ . . . అతడు: రామునిదొకటే బాణము, జానకి ఆతని ప్రాణము ఆమె: ఆ . . . అతడూ: ప్రేమకు అదియే నియమము, ప్రేయసి ఒకరే న్యాయము ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసమూ | |
ataDu: guTTugaa lEtaremmala kuluku ninnu
roTTemukkala madhyana peTTiranucu
Ela iTTula ciMtiMtuvE TomETO
ativaliddari madhya naa gatini ganumaa, aa . . .
okaTE hRdayaM kOsamu iruvuri pOTee dOshamu, okaTE hRdayaM kOsamoo
okaru satyabhaama okarEmo rukmiNi
madhya naliginaaDu maadhavuMDu
iddarativalunna irakaaTamEnayaa
viSwadaabhiraama vinura vEmaa, aa . . .
aame: aa . . O . .
ataDu: jatagaa celimee cEsiree, atigaa karuNE coopiree
aame: aa . . .
ataDu: celimE valapai maaritE, SivaSiva manapani aakharE
okaTE hRdayaM kOsamu iruvuri pOTee dOshamu, okaTE hRdayaM kOsamoo
aame: O . . .
ataDu: raamunidokaTE baaNamu, jaanaki aatani praaNamu
aame: aa . . .
ataDoo: prEmaku adiyE niyamamu, prEyasi okarE nyaayamu
okaTE hRdayaM kOsamu iruvuri pOTee dOshamu, okaTE hRdayaM kOsamoo
| |