|
Mana Ghantasala Song Lyricsmanasuna manasai bratukuna bratukai (2) |
| Movie:DaakTar cakravarti (1964) | Lyrics:SreeSree |
| Music:S. Rajeshwara Rao | Singers:Ghantasala |
| Submitted by: Panini | |
|
మనసున మనసై బ్రతుకున బ్రతుకై (2) తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము ఆశలు తీరని ఆవేశములో అశయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమె కన్నీరు నించుటకు (2) నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము చెలిమియే కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిలయై పోగా నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము | |
manasuna manasai bratukuna bratukai (2) tODokaruMDina adE bhaagyamoo, adE swargamu manasuna manasai bratukuna bratukai tODokaruMDina adE bhaagyamoo, adE swargamu aaSalu teerani aavESamulO aSayaalalO aavEdanalO ceekaTi moosina EkaaMtamulO tODokaruMDina adE bhaagyamoo, adE swargamu ninnu ninnugaa prEmiMcuTaku neekOsame kanneeru niMcuTaku (2) nEnunnaanani niMDuga palikE tODokaruMDina adE bhaagyamoo, adE swargamu celimiyE karuvai valapE arudai cedarina hRdayamE Silayai pOgaa nee vyadha telisee neeDaga nilicE tODokaruMDina adE bhaagyamoo, adE swargamu manasuna manasai bratukuna bratukai tODokaruMDina adE bhaagyamoo, adE swargamu | |