|
Mana Ghantasala Song Lyricsceliya lEdu celimi lEdu veluturE lEdoo (2) |
| Movie:dEvadaasu (1953) | Lyrics:samudraala, #Sr#. |
| Music:#C.R.# subburaaman | Singers:ghaMTasaala, #K.#raaNi |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
అతడు: చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదూ (2) ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే (2) మిగిలిందీ నీవేనే చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదూ ఆమె: చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే (2) చేరదీసి సేవజేసే తీరు కరువాయే (2) నీ దారే వేరాయే చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే అతడు: మరపు రాని బాధకన్నా మధురమే లేదూ (2) గతము తలచి వగచేకన్నా సౌఖ్యమే లేదూ (2) అందరాని పొందుకన్నా అందమే లేదూ ఆనందమే లేదూ చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదూ ఆమె: వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే (2) రగిలి పొగలౌ కుండలైనా పగిలి జారేనే (2) దారి లేని బాధతో నేనారిపోయేనా కథ తీరిపోయేనా చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే అతడు: ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే మిగిలిందీ నీ వే నే | |
ataDu: celiya lEdu celimi lEdu veluturE lEdoo (2)
unnadaMtaa ceekaTaitE uMdee neevEnE (2)
migiliMdee neevEnE
celiya lEdu celimi lEdu veluturE lEdoo
aame: celimee pOyE celuvoo pOyE nelavE vEraayE (2)
cEradeesi sEvajEsE teeru karuvaayE (2)
nee daarE vEraayE
celimee pOyE celuvoo pOyE nelavE vEraayE
ataDu: marapu raani baadhakannaa madhuramE lEdoo (2)
gatamu talaci vagacEkannaa soukhyamE lEdoo (2)
aMdaraani poMdukannaa aMdamE lEdoo
aanaMdamE lEdoo
celiya lEdu celimi lEdu veluturE lEdoo
aame: varadapaalou ceruvulainaa porali paarEnE (2)
ragili pogalou kuMDalainaa pagili jaarEnE (2)
daari lEni baadhatO nEnaaripOyEnaa
katha teeripOyEnaa
celimee pOyE celuvoo pOyE nelavE vEraayE
ataDu: unnadaMtaa ceekaTaitE uMdee neevEnE
migiliMdee nee vE nE
| |