Mana Ghantasala Song Lyrics

karuNaalavaalaa! idi needu leela, aMtayunu viMta pogaDaga nEneMta! (2)

Movie:ceMculakshmi (1958)Lyrics:?
Music:saalooriSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
కరుణాలవాలా! ఇది నీదు లీల, అంతయును వింత పొగడగ నేనెంత! (2)

నీ మాయ కానంగ లేరు, వేయి నేత్రాలు వున్నను యెవరు (2)
కరుణాలవాలా! ఇది నీదు లీల, అంతయును వింత పొగడగ నేనెంత!

పర సతులను చెరబట్టే అంధుడు, అతడా సురలోకము పాలించే ఇంద్రుడు (2)
పదవి మీద ఆశ చేత ప్రభువాయెను పశువు (2)
పాపము తన నేమి చేసె కడుపులోని శిశువు?
కరుణాలవాలా! ఇది నీదు లీల, అంతయును వింత పొగడగ నేనెంత!

బ్రహ్మ యిచ్చిన వరములు తెచ్చెను కర్మ, ఈ కర్మ
దుష్కర్మ నాపుట బ్రహ్మ విష్ణుల తరమా, తరమా!
బ్రహ్మ యిచ్చిన వరములు తెచ్చెను కర్మ, ఈ కర్మ
దుష్కర్మ నాపుట బ్రహ్మ విష్ణుల తరమా, తరమా!
తాను తీసిన గోతి లోపల పడునే తానే (2)
తపోశక్తిని జయించలేరు దైవమైన, పరదైవమైనను
కరుణాలవాలా! ఇది నీదు లీల, అంతయును వింత పొగడగ నేనెంత!

ఏడేడు లోకాల యేలిక, నీపైన పాడగా చాలదొక నాలుక (2)
నీవు తలచిన చాలు మేరువే అణువు, నీ చేతిలో గలదు అందరి పరువు
మహిమన్న నీవేనులే, యేమైన దైవమన నీవేనులే

ప్రవేశించు కొత్త పాత్రధారి, శ్రీహరియే నటన సూత్రధారి
ప్రవేశించు కొత్త పాత్రధారి
ఇది నీవాడించుచున్న నాటకము, ఇక నుండదు వింతలకే కాటకము (2)
కరుణాలవాలా! ఇది నీదు లీల, అంతయును వింత పొగడగ నేనెంత!

అధినాథుని పత్ని కూడ విధికి బానిసే (2)
జీవపథము మారిపోవునపుడు చిత్ర హింసయే!
పాలకడలిలోన పుట్టి వైకుంఠము మెట్టి (2)
నేల పాలు అయినావా నేటికి మహలక్ష్మీ! నేటికి మహలక్ష్మీ!
కరుణాలవాలా! ఇది నీదు లీల, అంతయును వింత పొగడగ నేనెంత!

మహా శక్తిమంతులైనా నిజం తెలియలేరయ్యో!
నిజం తెలియలేరే, నీ మాయ నరయ లేరే!
నరహరి రూపా నారాయణ, జయ నారాయణ, హరి నారాయణ
నీరు పల్లమెరుగు యెపుడూ నిజం తెలుసు నీకే (2)
నరహరి రూపా నారాయణ, జయ నారాయణ, హరి నారాయణ

కాంత చేతిలోపల యే మంత్రమున్నదో (2)
ఎంత భీకరుండైనా శాంత మొంది తీరునే
ఇంతి కంటి చూపుకి యినుమైనా కరుగునని
అంత వుగ్రమూర్తివి యిటుల మారినాడవా!
కరుణాలవాలా! ఇది నీదు లీల, అంతయును వింత పొగడగ నేనెంత!

        karuNaalavaalaa! idi needu leela, aMtayunu viMta pogaDaga nEneMta! (2)

        nee maaya kaanaMga lEru, vEyi nEtraalu vunnanu yevaru (2)
        karuNaalavaalaa! idi needu leela, aMtayunu viMta pogaDaga nEneMta!

        para satulanu cerabaTTE aMdhuDu, ataDaa suralOkamu paaliMcE iMdruDu (2)
        padavi meeda aaSa cEta prabhuvaayenu paSuvu (2)
        paapamu tana nEmi cEse kaDupulOni SiSuvu?
        karuNaalavaalaa! idi needu leela, aMtayunu viMta pogaDaga nEneMta!

        brahma yiccina varamulu teccenu karma, ee karma
        dushkarma naapuTa brahma vishNula taramaa, taramaa!
        brahma yiccina varamulu teccenu karma, ee karma
        dushkarma naapuTa brahma vishNula taramaa, taramaa!
        taanu teesina gOti lOpala paDunE taanE (2)
        tapOSaktini jayiMcalEru daivamaina, paradaivamainanu
        karuNaalavaalaa! idi needu leela, aMtayunu viMta pogaDaga nEneMta!

        EDEDu lOkaala yElika, neepaina paaDagaa caaladoka naaluka (2)
        neevu talacina caalu mEruvE aNuvu, nee cEtilO galadu aMdari paruvu
        mahimanna neevEnulE, yEmaina daivamana neevEnulE

        pravESiMcu kotta paatradhaari, SreehariyE naTana sootradhaari
        pravESiMcu kotta paatradhaari
        idi neevaaDiMcucunna naaTakamu, ika nuMDadu viMtalakE kaaTakamu (2)
        karuNaalavaalaa! idi needu leela, aMtayunu viMta pogaDaga nEneMta!

        adhinaathuni patni kooDa vidhiki baanisE (2)
        jeevapathamu maaripOvunapuDu citra hiMsayE!
        paalakaDalilOna puTTi vaikuMThamu meTTi (2)
        nEla paalu ayinaavaa nETiki mahalakshmee! nETiki mahalakshmee!
        karuNaalavaalaa! idi needu leela, aMtayunu viMta pogaDaga nEneMta!

        mahaa SaktimaMtulainaa nijaM teliyalErayyO!
        nijaM teliyalErE, nee maaya naraya lErE!
        narahari ruupaa naaraayaNa, jaya naaraayaNa, hari naaraayaNa
        neeru pallamerugu yepuDoo nijaM telusu neekE (2)
        narahari ruupaa naaraayaNa, jaya naaraayaNa, hari naaraayaNa

        kaaMta cEtilOpala yE maMtramunnadO (2)
        eMta bheekaruMDainaa SaaMta moMdi teerunE
        iMti kaMTi coopuki yinumainaa karugunani
        aMta vugramoortivi yiTula maarinaaDavaa!
        karuNaalavaalaa! idi needu leela, aMtayunu viMta pogaDaga nEneMta!

EDIT