Mana Ghantasala Song Lyrics

O anaarkali! O anaarkali!

Movie:anaarkali (1955)Lyrics:samudraala #Sr.#
Music:aadinaaraayaNaraavuSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
ఓ అనార్కలి! ఓ అనార్కలి!
ప్రేమకై బ్రతుకు బలిచేసిన అమరజీవి అనార్కలి
శయనించు నేడీ సమాధిలో శాశ్వతముగా చిరునవ్వుతో
ఓ ప్రేమమూర్తి అనార్కలి!

పారసీకపు సీమలోన పరిమళించిన అనార్కలి
పులకించి, వికసించి యువరాజు కరాల
నలిగి, నశియించె పాదుషా కఠినపదాల
ఓ అనార్కలి!

లేదు కరుణ రాజనీతికి, లేదు హృదయమే మొగల్‌ ప్రభులకు
నీదిగాదులే రాతిగోరి, పాదుషా హజామిది
అమలమై, ఆదర్శకరమై, అమరమై ఈ భారతావని
నీ పవిత్ర ప్రణయగాథ నిలిచిపోయే అనార్కలీ!
ఓ అనార్కలి!

తరలిపోయె అనార్కలి ఆ విధాన
తారయై వెలిగెను ప్రేమ గగనాన
నిలిచేను జగతి నీ ప్రేమ గాథ
తలచేరు నిన్ను తరతరాల
అమరజీవి అనార్కలి, అనార్కలి! అనార్కలి ...


        O anaarkali! O anaarkali!
        prEmakai bratuku balicEsina amarajeevi anaarkali
        SayaniMcu nEDee samaadhilO SaaSwatamugaa cirunavvutO
        O prEmamoorti anaarkali!

        paaraseekapu seemalOna parimaLiMcina anaarkali
        pulakiMci, vikasiMci yuvaraaju karaala
        naligi, naSiyiMce paadushaa kaThinapadaala
        O anaarkali!

        lEdu karuNa raajaneetiki, lEdu hRdayamE mogal prabhulaku
        needigaadulE raatigOri, paadushaa hajaamidi
        amalamai, aadarSakaramai, amaramai ee bhaarataavani
        nee pavitra praNayagaatha nilicipOyE anaarkalee!
        O anaarkali!

        taralipOye anaarkali aa vidhaana
        taarayai veligenu prEma gaganaana
        nilicEnu jagati nee prEma gaatha
        talacEru ninnu tarataraala
        amarajeevi anaarkali, anaarkali! anaarkali ...


EDIT