|
Mana Ghantasala Song Lyricsraamuni avataaram ravikulasOmuniavataaram |
| Movie:bhookailaas (1958) | Lyrics:samudraala #Sr.# |
| Music:#R.# sudarSanam, #R.# gOvardhanam | Singers:ghaMTasaala |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
సాకి: ద్వారపాలుర మరల దరిదీయు కృపయో ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో రాముని అవతారం రవికులసోముని అవతారం.... రాముని అవతారం రవికులసోమునీవతారం సుజనజనావన ధర్మాగారం దుర్జనహృదయవిదారం "రాముని" దాశరథిగ శ్రీకాంతుడు వెలయూ కౌసల్యాపతి తపము ఫలించూ జన్మింతురు సహజాతులు మువ్వురు జన్మింతురు సహజాతులు మువ్వురు లక్ష్మణ శత్రుఘ్న భరతా "రాముని" చదువులునేరుచు మిషచేత చాపముదాలిచిచేతా విశ్వామిత్రుని వెనువెంట యాగముకావగ చనునంట అంతముచేయునహల్యకు శాపము వొసగును సుందర రూపం "రాముని" ధనువో జనకుని మనమున భయమో ధారుణి కన్యాసంశయమో దనుజులుకలగను సుఖగోపురమో దనుజులుకలగను సుఖగోపురమో విరిగెను మిథిలానగరమునా "రాముని" వచనం: కపట నాటకుని పట్టాభిషేకం కలుగు తాత్కాలికా శోకం భీకర కానన వాశారంభం లోకోద్ధరణకు ప్రారంభం భరతుని కోరికతీరుచుకోసం పాదుకలొసగే ప్రేమావేశం నరజాతికినవ నవసంతోషం గురుజనసేవకు ఆదేశం "రాముని" అదిగో చూడుము బంగరు జింకా (X2) మన్నై చనునయ్యోలంకా హరనయనాగ్ని పరాంగన వంకా అరిగిన మరణమె నీకింకా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానరకుల పుంగవ హనుమ (X2) ముద్రిక కాదిది భువన నిదానం(X2) జివన్ముక్తికి సోపానం (X2) రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకులశోమా సీతాశోక వినాశనకారి లంకావైభవ సంహారి అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబౌనిక నీ చరిత సమయును పరసతిపై మమకారం వెలయును ధర్మ విచారం "రాముని" | |
saaki:
dwaarapaalura marala darideeyu kRpayO
dharalOna dharmamu nelakolpu nepamO
raamuni avataaraM ravikulasOmuni avataaraM....
raamuni avataaraM ravikulasOmuniavataaraM
sujanajanaavana dharmaagaaraM durjanahRdayavidaaraM "raamuni"
daaSarathiga SreekaaMtuDu velayoo
kousalyaapati tapamu phaliMcoo
janmiMturu sahajaatulu muvvuru
janmiMturu sahajaatulu muvvuru
lakshmaNa Satrughna bharataa "raamuni"
caduvulunErucu mishacEta caapamudaalicicEtaa
viSwaamitruni venuveMTa yaagamukaavaga canunaMTa
aMtamucEyunahalyaku Saapamu vosagunu suMdara roopaM "raamuni"
dhanuvO janakuni manamuna bhayamO
dhaaruNi kanyaasaMSayamO
danujulukalaganu sukhagOpuramO
danujulukalaganu sukhagOpuramO
virigenu mithilaanagaramunaa "raamuni"
vacanaM:
kapaTa naaTakuni paTTaabhiShEkaM
kalugu taatkaalikaa SOkaM
bheekara kaanana vaaSaaraMbhaM
lOkOddharaNaku praaraMbhaM
bharatuni kOrikateerucukOsaM
paadukalosagE prEmaavESaM
narajaatikinava navasaMtOshaM
gurujanasEvaku aadESaM "raamuni"
adigO cooDumu baMgaru jiMkaa (X2)
mannai canunayyOlaMkaa
haranayanaagni paraaMgana vaMkaa
arigina maraName neekiMkaa
rammu rammu hE bhaagavatOttama
vaanarakula puMgava hanuma (X2)
mudrika kaadidi bhuvana nidaanaM(X2)
jivanmuktiki sOpaanaM (X2)
raama raama jaya raama raama
jaya raama raama raghukulaSOmaa
seetaaSOka vinaaSanakaari
laMkaavaibhava saMhaari
ayyO raavaNa bhaktaagrEsara
amaraMbounika nee carita
samayunu parasatipai mamakaaraM
velayunu dharma vicaaraM "raamuni"
| |