|
Mana Ghantasala Song Lyricsmanasu parimaLiMcenE tanuvu paravaSimcenE |
| Movie:SreekRshNaarjuna yuddham (1963) | Lyrics:piMgaLi |
| Music:peMDyaala | Singers:ghaMTasaala, suSeela |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
అతడు: మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత గానముతో నీవు నటన చేయగనే ఆమె : మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే అతడు: నీకు నాకు స్వాగతమనగ కోయిలమ్మ కూయగా (2) ఆమె : గల గల జల సెలయేరులలో కలకలములు రేగగా అతడు : మనసు పరిమళించెనే తనువు పరవశించెనే ఆమె : నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే జంటగా:మనసు పరిమళించెనే..... అతడు: క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా (2) ఆమె : భ్రమరమ్ములు ఘుములు ఘుములుగా ఝుంఝుం అని పాడగా జంటగా:మనసు పరిమళించెనే తనువు పరవశించెనే అతడు: తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా (2) ఆమె: రంగ రంగ వైభవములతో ప్రకృతి విందు చేయగా జంటగా:మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే raaga: మోహన (based) | |
ataDu: manasu parimaLiMcenE tanuvu paravaSiMcenE
nava vasaMta gaanamutO neevu naTana cEyaganE
aame : manasu parimaLiMcenE tanuvu paravaSiMcenE
nava vasaMta raagamutO neevu ceMta niluvaganE
ataDu: neeku naaku svaagatamanaga kOyilamma kooyagaa (2)
aame : gala gala jala selayErulalO kalakalamulu rEgagaa
ataDu : manasu parimaLiMcenE tanuvu paravaSiMcenE
aame : nava vasaMta raagamutO neevu ceMta niluvaganE
jaMTagaa:manasu parimaLiMcenE.....
ataDu: krotta poola nettaavulatO mattugaali veecagaa (2)
aame : bhramarammulu ghumulu ghumulugaa jhuMjhuM ani paaDagaa
jaMTagaa:manasu parimaLiMcenE tanuvu paravaSiMcenE
ataDu: telimabbulu koMDakonalapai haMsalavale aaDagaa (2)
aame: raMga raMga vaibhavamulatO prakRti viMdu cEyagaa
jaMTagaa:manasu parimaLiMcenE tanuvu paravaSiMcenE
nava vasaMta raagamutO neevu ceMta niluvaganE
#raaga#: mOhana #(based)#
| |