|
Mana Ghantasala Song Lyricsdaanavakula vairi darpambu varNiMcu |
| Movie:seetaaraamakalyaaNam (1961) | Lyrics:samudraala raaghavaacaaryulu |
| Music:gaali peMcala narasiMhaaraavu | Singers:ghaMTasaala |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
దానవకుల వైరి దర్పంబు వర్ణించు చదువులెవ్వరుగాని చదువరాదు సురపక్షపాతి విస్ఫురణకై గావించు యాగంబు లేవియు సాగరాదు అమరుల మేలుకై ఆచరించెడి యజ్ఞ గుండంబులం దగ్ని మండరాదు హర నామమేగాని హరి నామధేయంబు త్రిజగాల నెవ్వరు స్మరించరాదు అమరలోక విజేత లంకాధినేత రావణుని శాసనంబు నిరాకరించు విష్ణుదాసుల బట్టి కేల్ విరచిగట్టి చెరను నెట్టుడు దానవ శ్రేష్టులారా ! | |
daanavakula vairi darpaMbu varNiMcu
caduvulevvarugaani caduvaraadu
surapakshapaati visphuraNakai gaaviMcu
yaagaMbu lEviyu saagaraadu
amarula mElukai aacariMceDi yaj~na
guMDaMbulaM dagni maMDaraadu
hara naamamEgaani hari naamadhEyaMbu
trijagaala nevvaru smariMcaraadu
amaralOka vijEta laMkaadhinEta
raavaNuni SaasanaMbu niraakariMcu
vishNudaasula baTTi kEl viracigaTTi
ceranu neTTuDu daanava SrEshTulaaraa !
| |