![]() |
Mana Ghantasala Song LyricsE nimishaaniki yEmi jarugunO |
Movie:lavakuSa (1963) | Lyrics:samudraala #Sr.# |
Music:ghaMTasaala | Singers:ghaMTasaala |
Submitted by: Sreenivas Paruchuri | |
ఏ నిమిషానికి యేమి జరుగునో ఎవరూహించెదరు? యెవరూహించెదరూ... ఏ నిమిషానికి యేమి జరుగునో ఎండకన్ను యెరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు తరచి చూచినా బోధపడవులే దైవ చిద్విలాశాలూ.. ఎండకన్ను యెరుగని ఇల్లలికి ఎందుకో ఈ వనవాసాలు కంచెయె నిజముగ చేనుమేసినా కాదనువారెవరూ... రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించువారెవరూ.. ఏ నిమిషానికి యేమి జరుగునో ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా వినివీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా... ఏ నిమిషానికి యేమి జరుగునో | |
E nimishaaniki yEmi jarugunO evaroohiMcedaru? yevaroohiMcedaroo... E nimishaaniki yEmi jarugunO eMDakannu yerugani illaaliki eMdukO ee vanavaasaalu taraci coocinaa bOdhapaDavulE daiva cidvilaaSaaloo.. eMDakannu yerugani illaliki eMdukO ee vanavaasaalu kaMceye nijamuga cEnumEsinaa kaadanuvaarevaroo... raajE idi Saasanamani palkina pratighaTiMcuvaarevaroo.. E nimishaaniki yEmi jarugunO inakulamuna janiyiMcina nRpatulu ee daaruNamu sahiMcedaraa viniveedhini SrENulugaa nilci viDDooramugaa coocedaraa... E nimishaaniki yEmi jarugunO |