|
Mana Ghantasala Song LyricsollanOri maamaa nee pillanee |
| Movie:lavakuSa (1963) | Lyrics:sadaaSivabrahmaM |
| Music:ghaMTasaala | Singers:ghaMTasaala (vee), jikki (la), raaghavulu (pE), raaNi (ci) |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
వీరిగాడు: ఒల్లనోరి మామా నీ పిల్లనీ అబ్బా నీ పిల్లా దీని మాటలెల్ల కల్ల సంసారమంత గుల్ల "ఒల్ల" లచ్చి: ఒల్లనంట వెందుకు మామయ్య నా వల్ల నేరమేమిర అయ్యయ్యో దెయ్యాన్ని కొడుదునా దేవతనీ కొడుదునా నూతులో పడుదునా గోతులో పడుదునా వీ: చెయ్! చెమతకారి నాయాలా వూరుకో సూరిగాడి ఇంటికాడ సూడలేదటే నిన్ను మారుమాట లాడుతావా మాయదారి గుంట నిను సూస్తె వళ్ళు మంట "నేనొల్ల" పేరిగాడు: అయిందాని కల్లరెందు కల్లుడా ఓరల్లుడా మేనల్లుడ మా అప్పగొరి పిల్లడా మీ అప్ప మొగం చూడరా మా యమ్మిని కాపాడరా "నేనొల్ల" చిన్నమ్మ: తప్పేమి చేసింది తమ్ముడా ఇప్పుడు ముప్పేమి వచ్చింది తమ్ముడా తప్ప తాగి వున్నావు చెప్పుడు మాటిన్నావు అప్పడగ బోయింది అదీ ఒక తప్పా వీ: అప్పా ఓ లప్పా నీ మాటలు నేనొప్పా యిక చాలును మీ గొప్పా నా ఆలి గుణము ఎరుగన నే నేలుకోను తీసుకుపో "నేనొల్ల" ల: నీ తాగుబోతు మాటలింక మానరా నే సత్తెమైన యిల్లాలిని చూడరా నే నగ్గి ముట్టుకుంటా అరిచేత పట్టుకుంటా తలమీద పెట్టుకుంటా వీ: చెయ్! ఎర్రి రాముడంటి వోణ్ణి కాదొలే గొప్ప శౌర్యమైన యింటబుట్టి నానొలె అగ్గిలోన బడ్డా నువు బుగ్గిలోన బడ్డా పరాయింట వున్న దాన్ని పంచ జేరనిస్తానా ఒల్ల నోలె పిల్లా యింకెల్లిపో | |
veerigaaDu: ollanOri maamaa nee pillanee
abbaa nee pillaa deeni maaTalella kalla
saMsaaramaMta gulla "olla"
lacci: ollanaMTa veMduku maamayya
naa valla nEramEmira ayyayyO
deyyaanni koDudunaa dEvatanee koDudunaa
nootulO paDudunaa gOtulO paDudunaa
vee: cey! cematakaari naayaalaa voorukO
soorigaaDi iMTikaaDa sooDalEdaTE ninnu
maarumaaTa laaDutaavaa maayadaari guMTa
ninu sooste vaLLu maMTa "nEnolla"
pErigaaDu: ayiMdaani kallareMdu kalluDaa
OralluDaa mEnalluDa maa appagori pillaDaa
mee appa mogaM cooDaraa maa yammini kaapaaDaraa "nEnolla"
cinnamma: tappEmi cEsiMdi tammuDaa ippuDu
muppEmi vacciMdi tammuDaa
tappa taagi vunnaavu ceppuDu maaTinnaavu
appaDaga bOyiMdi adee oka tappaa
vee: appaa O lappaa nee maaTalu nEnoppaa
yika caalunu mee goppaa
naa aali guNamu erugana nE
nElukOnu teesukupO "nEnolla"
la: nee taagubOtu maaTaliMka maanaraa
nE sattemaina yillaalini cooDaraa
nE naggi muTTukuMTaa aricEta paTTukuMTaa
talameeda peTTukuMTaa
vee: cey! erri raamuDaMTi vONNi kaadolE
goppa Sauryamaina yiMTabuTTi naanole
aggilOna baDDaa nuvu buggilOna baDDaa
paraayiMTa vunna daanni paMca jEranistaanaa
olla nOle pillaa yiMkellipO
| |