Mana Ghantasala Song Lyrics

haayihaayigaa jaabilli tolirEyi veMDidaaraalalli

Movie:Lyrics:mallaadi
Music:rAjESvara raavuSingers:suSeela, ghaMTasaala
Submitted by: Ravi Manda
హాయిహాయిగా జాబిల్లి తొలిరేయి వెండిదారాలల్లి
మందుజల్లి నవ్వసాగే ఎందుకో మత్తుమందుజల్లి నవ్వసాగే ఎందుకో (2) (హాయిహాయిగా)

తళతళ మెరిసిన తారక తెలివెలుగుల వెన్నెల దారుల (2)
కోరి పిలిచెను తనదరి చేరగ మది తలచెను తీయని కోరిక (హాయిహాయిగా)

మిలమిల వెలిగే నీటిలో చెలి కలువలరాణి చూపులో (2)
సుమదళములు పూచిన తోటలో తొలివలపుల తేనెలు రాలెను (హాయిహాయిగా)

విరిసిన హృదయమే వీణగా మధురసముల కొసరిన వేళల (2)
తొలి పరువములొలికెడు సోయగం కని పరవశమందెను మానసం (హాయిహాయిగా)





haayihaayigaa jaabilli  tolirEyi veMDidaaraalalli
maMdujalli navvasaagE eMdukO  mattumaMdujalli navvasaagE eMdukO (2)   (haayihaayigaa)

taLataLa merisina taaraka  telivelugula vennela daarula (2)
kOri pilicenu tanadari cEraga  madi talacenu teeyani kOrika   (haayihaayigaa)

milamila veligE neeTilO  celi kaluvalaraaNi cUpulO (2)
sumadaLamulu pUcina tOTalO  tolivalapula tEnelu raalenu    (haayihaayigaa)

virisina hRdayamE veeNagaa  madhurasamula kosarina vELala (2)
toli paruvamulolikeDu sOyagaM  kani paravaSamaMdenu maanasaM   (haayihaayigaa)





EDIT